తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రపంచానికి భారత్​ విశ్వసనీయ భాగస్వామి'

భారత్​ను​ ఒక విశ్వసనీయ, ఆశాజనక భాగస్వామిగా ప్రపంచం భావిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొవిడ్​ సంక్షోభ సమయంలోనూ దేశం​లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం ఎన్నో రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

prime minister narendra modi delivered keynote address at paniit global summit
'ప్రపంచానికి భారత్​ నమ్మకమైన, ఆశాజనక భాగస్వామి'

By

Published : Dec 5, 2020, 5:34 AM IST

కరోనా వంటి పరీక్షాకాలంలోనూ భారత్​లో పెట్టుబడులు భారీగా పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్​ను​ విశ్వసనీయ, ఆశాజనక భాగస్వామిగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ-2020 గ్లోబల్ సమ్మిట్​లో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు మోదీ. ప్రతిరంగంలోనూ సంస్కరణలకు ప్రపంచదేశాలు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. దేశంలోనూ అనేక రంగాల్లో సృజనాత్మక ఆలోచనలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం "సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన" సూత్రాలకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఎన్నో రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు.

"వ్యవసాయం, ఆర్థిక రంగం, బ్యాంకింగ్​, పన్నులు వంటి అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చాం. 44 కేంద్ర కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోడ్‌లుగా సమీకరించి, కార్మిక రంగంలో సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాం. మా కార్పొరేట్ పన్ను రేటు.. ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది."

-- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

భారత్​ తన ఆచరణలో భారీ మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోందని మోదీ అన్నారు. తాము ఎప్పటికీ జరగదని భావించిన పనులు.. ప్రస్తతం గొప్ప వేగంతో సాగుతున్నాయని చెప్పారు.

ఇదీ చూడండి:'8న భారత్​ బంద్​' - 'సుప్రీం కోర్టులో పిటిషన్'​

ABOUT THE AUTHOR

...view details