బంగాల్లో నవరాత్రుల పూజల ప్రారంభం సందర్భంగా వర్చువల్గా నిర్వహిస్తోన్న 'పూజోర్ శుబికా' కార్యక్రమంలో పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమత్రి నరేంద్ర మోదీ. దుర్గాపూజ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. ముందుగా రాష్ట్ర ప్రజలకు బెంగాళీలో శుభాకాంక్షలు తెలిపారు మోదీ. దుర్గా పూజలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు మోదీ.
మహిళలు.. మహాదుర్గ అమ్మవారికి ప్రతిరూపాలు అని పేర్కొన్నారు మోదీ. వివిధ పథకాలు, విధానాలతో మహిళల సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.
" మనం కొవిడ్-19 మహమ్మారి సమయంలో దుర్గాపూజ ఉత్సవాలు చేసుకుంటున్నాం. ప్రజలు తక్కువ ఉన్నా... పూజలు, భక్తి అదే స్థాయిలో ఉన్నాయి. ప్రజల్లో ఆనందం, ఉత్సాహం అనంతంగా ఉన్నాయి. ఇది నిజమైన బంగాల్. ఉత్సవాల్లో రెండు గజాల దూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. పండుగలు భారత దేశ బలం, ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే.. బంగాల్లోని సంప్రదాయం, సంస్కృతిని కూడా సూచిస్తాయి."