సులభతర వాణిజ్యంలో భారత్ మెరుగైన స్థానం సంపాదించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. అనేక అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ..ముందంజలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
బడ్జెట్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు కోవింద్. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి అన్నారు.
రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"మన ప్రభుత్వం అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం అనే మూలమంత్రంతో నిష్ఠగా, జవాబుదారీతనంతో పనిచేస్తోంది. 8 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు, 2 కోట్ల మందికి ఇళ్లు, 38 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు, 50 కోట్ల మందికి రూ.5 లక్షల ఆరోగ్యబీమా పథకం, 24 కోట్ల మందికి బీమా భద్రత పథకం, రెండున్నర కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్లను ఎలాంటి భేదభావాలు లేకుండా పారదర్శకంగా అందించాం. మా ప్రభుత్వం కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ చేరేలా సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజల విశ్వాసాన్ని కూడా కోరుతున్నాం."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి