ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ఆయన జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు.
'అధికరణ 370 రద్దుతో నెరవేరిన 70 ఏళ్ల కల' - BUDGET SESSION
అధికరణ 370 రద్దుతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికరణ రద్దుతో ఏడు దశాబ్దాల కల నెరవేరిందన్నారు.
!['అధికరణ 370 రద్దుతో నెరవేరిన 70 ఏళ్ల కల' PREZ SPEECH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5905961-thumbnail-3x2-ps.jpg)
PREZ SPEECH
రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీతోపాటు కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధుల కల ఏడు దశాబ్దాల తర్వాత సాకారమైనందుకు దేశమంతా సంతోషిస్తోంది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు, దళితులు, మహిళలకు దేశప్రజలకు లభించిన అధికారాలు దక్కాయి. పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో 370, 35-ఏ అధికరణల రద్దు చేయటం చారిత్రకమే కాదు జమ్ముకశ్మీర్, లద్దాఖ్ సమానంగా అభివృద్ధి చెందేందుకు మార్గం ఏర్పడింది."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
Last Updated : Feb 28, 2020, 3:41 PM IST