తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత సుష్మా స్వరాజ్​ పార్థివదేహానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సుష్మ మృతితో కొందరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి

By

Published : Aug 7, 2019, 11:12 AM IST

'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి
భాజపా నేత సుష్మా స్వరాజ్​ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ములాయం సింగ్​ యాదవ్​, మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​... సుష్మ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలువురు నేతలు సుష్మాతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మహిళలకు రోల్ మోడల్​: అడ్వాణీ

సుష్మా స్వరాజ్​ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ. తనకు ఎంతో సన్నిహితురాలని గుర్తుచేసుకున్నారు. మహిళలకు సుష్మ రోల్​ మోడల్​గా నిలిచారని కొనియాడారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అడ్వాణీ. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరు, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు.

అభిమాన నేతను కడసారి చూసేందుకు దేశ నలుమూలల నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం

ABOUT THE AUTHOR

...view details