జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. కశ్మీర్ పునర్విభజన బిల్లును చట్టంగా మారుస్తూ గెజిట్ ప్రచురించింది రాష్ట్రపతి కార్యాలయం. ఈ మేరకు జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అక్టోబర్ 31 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
అక్టోబర్ 31 నుంచి యూటీలుగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్ - రామ్‌నాథ్ కోవింద్
జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను ప్రచురించింది రాష్ట్రపతి కార్యాలయం. ఈ మేరకు అక్టోబర్ 31 నుంచి జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వస్తాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రపతి
ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే బిల్లుకు ఈ వారంలోనే పార్లమెంటు ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు
Last Updated : Aug 9, 2019, 10:20 PM IST