తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీటి పొదుపు తక్షణావసరం: రాష్ట్రపతి - భూగర్భ జలాల దుర్వినియోగం నివారణ

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ 6వ భారత జల వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జల సంరక్షణకు రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటి వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, నీటి వృథాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

నీటి పొదుపు తక్షణావసరం: రాష్ట్రపతి

By

Published : Sep 24, 2019, 5:51 PM IST

Updated : Oct 1, 2019, 8:34 PM IST

నీటి సంరక్షణకు రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు కృషి చేయాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పిలుపునిచ్చారు. ఆరో భారత జల వారోత్సవాలను దిల్లీలో ప్రారంభించిన ఆయన.. వ్యవసాయం, పరిశ్రమల కోసం వినియోగించే నీటిలో వృథాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో నీటి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం జరిగిందని, భవిష్యత్​ తరాల కోసం పరిశుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకువాల్సిన అవసరం ఉందని రామ్​నాథ్​ కోవింద్ అన్నారు.

"మనం తరచుగా కర్బన ఉద్గారాలను తగ్గించడం గురించి మాట్లాడతాం. ఇప్పుడు నీటి వినియోగం తగ్గించడం గురించి మాట్లాడే సమయం వచ్చింది. మన రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు... వ్యవసాయం, పరిశ్రమల కోసం వినియోగించే నీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ నీటితో పంటలు పండించే, ఉత్పత్తులు సాధించే పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది."
- రామ్​నాథ్​ కోవింద్, భారత రాష్ట్రపతి

నమామి గంగే..

నమామి గంగే ప్రాజెక్ట్ ద్వారా గంగానదీ జలాల శుద్ధీకరణకు కృషి జరుగుతోందని రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. గంగానదీతో పాటు మిగతా నదీ జలాలను కాపాడుకోవాలని, ఇది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని ఆయన కోరారు.

పర్యావరణహితమైన దేవతా విగ్రహాలను మాత్రమే నదుల్లో నిమజ్జనం చేయాలని రామ్​నాథ్​ కోరారు. అప్పుడే నదీ జలాలు శుభ్రంగా ఉండి, జలచరాలు సురక్షితంగా ఉంటాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. కొందరు అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను వృథా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని అన్ని గృహాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్​ను చేపట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.

ఇదీ చూడండి:భూమిని ఆకాశం ముద్దాడిన దృశ్యం చూశారా?


Last Updated : Oct 1, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details