తెలంగాణ

telangana

ETV Bharat / bharat

47 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు - ఉపాథ్యాయులకు రాష్ట్రపతి పురస్కరాలు

బోధనాలో వినూత్న పద్ధతులను అవలంభించిన 47 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యార్థుల పురోగతికి కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆకాంక్షించారు.

Prez confers National Teachers' AwardsPrez confers National Teachers' Awards
రాష్ట్రపతి చేతుల మీదల 47 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

By

Published : Sep 5, 2020, 5:26 PM IST

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని సృజనాత్మక పద్ధతిలో విద్యాబోధన చేస్తున్న 47 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ ‌కోవింద్ పురస్కారాలను అందజేశారు. వర్చువల్​ ద్వారా ఈ పురస్కారాలను అందించారు కోవింద్‌.

పెద్దపెద్ద భవంతులు, ఖరీదైన పరికరాలు లేక మౌలిక వసతులు.. ఓ మంచి పాఠశాలను తయారుచేయలేవని.. ఉత్తమ ఉపాధ్యాయులు మాత్రమే ఆ పని చేయగలరని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థులను వారు మాత్రమే విజ్ఞాన వంతులుగా, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దగలరని అభిప్రాయపడ్డారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని విద్యార్థులకు దగ్గర కావాలని సూచించారు.

ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్రపతి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details