మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వినీత్ కొఠారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో కలత చెందారు జస్టిస్ తహిల్ రమణి. బదిలీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని జస్టిస్ తహిల్ రమణి కోరినప్పటికీ కొలీజియం తిరస్కరించింది. దీంతో ఆమె తనసెప్టెంబర్ 6నరాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికు పంపారు.