తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్గిల్​ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి నివాళి! - కార్గిల్​ దివస్

దేశవ్యాప్తంగా నేడు కార్గిల్​ దివస్​ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్గిల్​, జాతీయ యుద్ధ స్మారకాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జమ్ముకశ్మీర్​లోని కార్గిల్​ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ జవాన్లకు నివాళులర్పించనున్నారు.

కార్గిల్​ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి నివాళి!

By

Published : Jul 26, 2019, 6:13 AM IST

కార్గిల్​ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు. ఆపరేషన్​ విజయ్​కు​ గుర్తుగా నిర్వహించే కార్గిల్​ దివస్​ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అమర జవాన్లకు నివాళిగా జమ్ముకశ్మీర్​ ద్రాస్​లోని కార్గిల్​ యుద్ధ స్మారకం, దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించనున్నారు పలువురు నేతలు, అధికారులు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ జమ్ముకశ్మీర్​ ద్రాస్​లోని కార్గిల్​ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమర జవాన్లకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఆనవాయితీ ప్రకారం దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద గల అమర జవాన్​ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తారు.

విజయ జ్యోతి

కార్గిల్​ దివస్​ ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 14న దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద 'విజయ జ్యోతి'ని వెలిగించారు రాజ్​నాథ్ సింగ్​​. సైన్యానికి చెందిన ద్విచక్ర వాహనాల బృందానికి జ్యోతిని అందించారు. ఆ జ్యోతి నేడు ద్రాస్​లోని కార్గిల్​ యుద్ధ స్మారకానికి చేరుకోనుంది. అక్కడి అమర జ్యోతిలో ఐక్యమవుతుంది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ విజయ్​: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details