దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రపంచీకరణ, పోటీ యుగంలో కృతిమ మేధస్సు, మానవత మధ్య సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు కోవింద్.
" ఈ కార్యక్రమం ద్వారా జాతీయ ఉత్తమ పురస్కారం అందుకుంటున్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం విద్యార్థుల ప్రతిభ మెరుగుపరిచేందుకు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీరంతా నిబద్ధులై ఉండాలని అందించినది."