సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ పండుగతో సమాజంలో ప్రేమానురాగాలు, ఐక్యత వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖశాంతులను, సంపదలను ఈ పండగ తీసుకురావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు.