తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి

దేశంలో ఆరోగ్య రంగం అన్నిరకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్పష్టం చేశారు. బెంగళూరులోని రాజీవ్​గాంధీ హెల్త్ సైన్సెస్​ విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.

president ram nath kovind tells indias healthcare system has improved alot and is ready to take challenges of pandemic
'దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం'

By

Published : Feb 7, 2021, 2:05 PM IST

దేశ ఆరోగ్య రంగం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తెలిపారు. ఆరోగ్యరంగ సేవల విస్తరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని అభిలషించారు. రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశం ఆరోగ్య సంరక్షణలో కీలక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కోవింద్​ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం సరైన పాఠాలు నేర్చుకుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు.

"భారతదేశంలో ఆరోగ్యసేవలు మరింత విస్తృతం అవుతాయి. రోగ నిర్దరణ, నివారణ, చికిత్సల్లో మార్పులు రాబోతున్నాయి. మహమ్మారుల విజృంభణ సమయాల్లో తలెత్తే ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కరోనా హెచ్చరించింది."

-రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

ఆర్​జీహెచ్ఎస్​యూ సేవలు గర్వకారణం..

రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ(ఆర్​జీహెచ్ఎస్​యూ) వైద్యులు, నర్సుల బృందం చేసిన సేవలను రామ్​నాథ్​ కొనియాడారు. సుమారు రెండు లక్షల మంది ఆరోగ్య​ నిపుణులు దీని ద్వారా శిక్షణ పొందారని తెలిసి సంతోషించానన్నారు. ఆత్మ నిర్భర్ భారత్​లో ప్రపంచానికి కరోనా టీకా అందించామని రామ్​నాథ్​ తెలిపారు. ఇతర దేశాలకు అందిస్తూ అండగా నిలుస్తున్నామని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:వార్​ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details