కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. సిన్హా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సిన్హా ప్రమాణం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సిన్హా ప్రమాణస్వీకారం
మాజీ దౌత్యాధికారి, ప్రస్తుత సమాచార కమిషనర్ అయిన 62 ఏళ్ల సిన్హా.. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్, కార్మికశాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా, కాగ్ మాజీ అధికారి సరోజ్ పున్హానీలు... సిన్హాకు సహ కమిషనర్లుగా నియమితులయ్యారు. కమిషనర్లుగా పై ముగ్గురి నియామకంతో దేశంలో సమాచార కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరింది.