రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశానికి సందేశం ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ప్రకటన విడుదల చేసింది.
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం - 74th Independence Day speech of rashtrapati
74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాత్రి 7 గంటలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఛానళ్లలో ఆయన సందేశం ప్రసారం కానుంది.
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
శుక్రవారం రాత్రి 7గంటలకు ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్, దూరదర్శన్ ఛానళ్లలో రాష్ట్రపతి సందేశం ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ, ఆ తర్వాత ఆంగ్ల భాషలో ప్రసంగం ఉంటుంది. అనంతరం రాత్రి 9:30గంటలకు అన్ని ప్రాంతీయ భాషల్లో రాష్ట్రపతి సందేశాన్ని అనువాదం చేసి దూరదర్శన్ ప్రసారం చేస్తుంది.