కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై సోమవారం గవర్నర్ల సదస్సు నిర్వహిస్తోంది కేంద్ర విద్యా శాఖ. 'ఉన్నత విద్య పరివర్తనలో జాతీయ విద్యావిధానం-2020 పాత్ర' పేరిట చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ మేరకు సమావేశంపై ట్వీట్ చేశారు మోదీ.
" సెప్టెంబర్ 7 ఉదయం 10.30 గంటలకు నూతన జాతీయ విద్యావిధానం-2020, దాని ప్రభావంపై నిర్వహిస్తోన్న గవర్నర్లు, వర్సిటీల ఉపకులపతుల సదస్సులో రాష్ట్రపతితో పాటు పాల్గొననున్నాను. ఈ సమావేశంలోని చర్చలు.. భారత్‌ను నైపుణ్య కేంద్రంగా మార్చాలనే మా ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తాయి. "