తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్ ప్రారంభోత్సవానికి అగ్రనేతలు హాజరు! - captain amarinder singh

సిక్కుల సౌలభ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా నవంబర్​లో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ను ఆహ్వానించారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఆయన ఆహ్వానానికి అగ్రనేతలు అంగీకారం తెలిపారు.

కర్తార్​పుర్ ప్రారంభోత్సవానికి అగ్రనేతలు హాజరు!

By

Published : Oct 3, 2019, 5:50 PM IST

సిక్కుల పుణ్యక్షేత్రాలను అనుసంధానించే కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు ఆహ్వానం పలికారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఇందుకు ముగ్గురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

తొలి బృందంలో మన్మోహన్​...

నడవా ప్రారంభమయ్యాక పాకిస్థాన్​లోని కర్తార్​పుర్​ సాహిబ్​ గురుద్వారాకు నవంబర్​ 9న ​వెళ్లే తొలి బృందంలో భాగమవ్వాలని మన్మోహన్​ను కోరారు అమరీందర్. ఇందుకు ఆయన అంగీకరించారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ తొలి బృందంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.

పక్షం రోజుల పాటు కార్యక్రమాలు..

ఈ ఏడాది గురునానక్ దేవ్​ 550వ జయంతి. అందుకే ఏటా నిర్వహించే ప్రకాశ్ పర్వ్​కు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలోని డేరా బాబానానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను కలుపుతూ కర్తార్‌పుర్‌ ఆధ్యాత్మిక నడవా నిర్మాణమైంది.

ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్​ జామ్​ అయితే ఆనందమే!

ABOUT THE AUTHOR

...view details