తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్లమెంటుపై దాడి' అమరులకు ఘన నివాళులు - political leaders tribute to victims of 2001 Parliament attack

18 ఏళ్ల క్రితం పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సహా పలువురు నేతలు ఘననివాళి అర్పించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న సంకల్పానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు.

tributes to victims of 2001 Parliament attack
'పార్లమెంటుపై దాడి' అమరులకు ఘన నివాళులు

By

Published : Dec 13, 2019, 11:47 AM IST

Updated : Dec 13, 2019, 3:28 PM IST

'పార్లమెంటుపై దాడి' అమరులకు ఘన నివాళులు

2001 పార్లమెంట్​పై ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​షా, మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్ సహా పలువురు నేతలు పార్లమెంటు ప్రాంగణంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు.

అమరుల త్యాగం

'పార్లమెంటుపై దాడి' అమరులకు ఘన నివాళులు

"2001లో భయంకరమైన ఉగ్రదాడి నుంచి పార్లమెంట్​ను రక్షించేందుకు ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆ మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలన్న సంకల్పానికి మేము కట్టుబడి ఉన్నాం."
- రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

కేంద్ర మంత్రులు, వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్లమెంటు దాడి అమరులకు నివాళులు అర్పించారు.

18 ఏళ్ల క్రితం..

2001 డిసెంబర్​ 13న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పార్లమెంట్​పై దాడి చేశారు. ముష్కరులను నిలువరించే ప్రయత్నంలో వీరోచితంగా పోరాడిన 9 మంది అమరులయ్యారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.

ఇదీ చూడండి: 'మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించండి'

Last Updated : Dec 13, 2019, 3:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details