తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'370 రద్దుతో సర్దార్ పటేల్ కల సాకారం చేశాం' - unity run in delhi

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ 144వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసి పటేల్​ కలను సాకారం చేశామని షా వ్యాఖ్యానించారు. అనంతరం ఐక్యతా పరుగును ప్రారంభించారు.

సర్దార్ పటేల్

By

Published : Oct 31, 2019, 8:45 AM IST

Updated : Oct 31, 2019, 12:24 PM IST

'370 రద్దుతో సర్దార్ పటేల్ కల సాకారం చేశాం'

భారత మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​కు.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు.

సర్దార్​​ 144వ జయంతిని పురస్కరించుకుని దిల్లీలోని పటేల్​ విగ్రహానికి రాష్ట్రపతి, హోంమంత్రి, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్ పూరీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

దేశాన్ని అఖండ భారతంగా మార్చటానికి పటేల్​ చేసిన కృషి మరువలేనిదని అమిత్​ షా ఉద్ఘాటించారు. అప్పుడు మిగిలిపోయిన కశ్మీర్​ సమస్యను ప్రస్తుతం పరిష్కరించి సర్దార్​ కలను నెరవేర్చామని పేర్కొన్నారు.

"స్వాతంత్య్రానంతరం 550 స్వదేశీ సంస్థానాలను పటేల్​ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక ముక్క మిగిలిపోయింది... జమ్ము కశ్మీర్. భారత్​లో విలీనమయింది కానీ.. 370, 35(ఏ) అధికరణలతో దేశానికి సమస్యగా పరిణమించింది. ఆగస్టు 5న 370, 35(ఏ) అధికరణలను భారత పార్లమెంటు చేసింది. సర్దార్​ పటేల్ కలను సాకారం చేశాం. వీటిని రద్దు చేసి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలు కల్పించే మార్గాన్ని మూసివేశాం."

-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

అనంతరం దిల్లీలోని జాతీయ మైదానంలో రాష్ట్రీయ్ ఏక్​తా దివస్​ను పురస్కరించుకుని ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు షా. ఇందులో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.

Last Updated : Oct 31, 2019, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details