తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం - talaq

మోదీ 2.0  ప్ర‌భుత్వం రూపొందించిన ముమ్మారు త‌లాక్ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్​ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఆ బిల్లు చ‌ట్ట‌రూపం దాల్చింది. ముస్లిం మ‌హిళ‌ల‌కు మూడుసార్లు త‌లాక్ చెబితే.. కొత్త చ‌ట్టం ప్ర‌కారం భ‌ర్త‌ల‌కు మూడేళ్ల జైలు శిక్ష‌ను విధించ‌నున్నారు.

ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

By

Published : Aug 1, 2019, 10:44 AM IST

ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదం లభించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కి రాజ్యసభ జులై 30న అంగీకారం తెలిపింది. గతవారమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.

తాజాగా రాష్ట్ర‌ప‌తి సంతకంతో ముమ్మారు తలాక్​ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు ఏకకాలంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం క్రిమినల్​ నేరంగా పరిగణిస్తారు. అలా చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

ABOUT THE AUTHOR

...view details