తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్ర విద్యా శాఖ' పేరుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మార్పునకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సచివాలయ వ్యవహార నిబంధన (బిజినెస్ రూల్స్​)ల్లో సవరణలు చేశారు. నూతన విద్యా విధానంతో పాటు మంత్రిత్వ శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కేంద్ర కేబినెట్​ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

MHRD PREZ
రాష్ట్రపతి

By

Published : Aug 18, 2020, 5:00 AM IST

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా శాఖగా మార్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదించారు. దీనిపై నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సచివాలయ వ్యవహార నిబంధన (బిజినెస్ రూల్స్​)ల్లో సవరణలు చేశారు.

భారత ప్రభుత్వ (అలకేషన్ ఆఫ్ బిజినెస్​) నిబంధనలు-1961లోని మొదటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న 'మానవ వనరుల అభివృద్ధి శాఖ' పేరును 'విద్యా శాఖ'గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్​ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు.

విద్యా విధానంలో మార్పులు..

నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం.. మంత్రిత్వ శాఖ పేరును కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. జులై 29న జరిగిన కేబినెట్​ భేటీలో నూతన విద్యా విధానం ముసాయిదా సిఫార్సుల ప్రకారం ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి:'నూతన విద్యా విధానంపై అనుమానాలు నివృత్తి చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details