తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హర్​సిమ్రత్​ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం - రాష్ట్రపతి రాజ్​నాథ్​ కోవింద్​

కేంద్రమంత్రి పదవికి హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు. ఇంతవరకు హర్‌సిమ్రత్‌ నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేందర్‌సింగ్‌ తోమర్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది రాష్ట్రపతి కార్యాలయం.

President approves Harsimrat kaur's resignation amid farmer's agitation on bill
హర్​సిమ్రత్​ కౌర్​ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

By

Published : Sep 18, 2020, 9:23 AM IST

వ్యవసాయ సంబంధిత బిల్లులను వ్యతిరేకించి.. కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ సమర్పించిన రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ప్రధాని సలహా మేరకు.. హర్‌సిమ్రత్‌ రాజీనామాను తక్షణమే ఆమోదిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

ఇంతవరకు హర్‌సిమ్రత్‌ నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేందర్‌సింగ్‌ తోమర్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది రాష్ట్రపతి కార్యాలయం. ప్రస్తుతం తోమర్‌ వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:-బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: మోదీ

ABOUT THE AUTHOR

...view details