ఇస్లాం పర్వదినం ఈద్ అల్ అజా(బక్రీద్) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. త్యాగం, స్నేహశీలాన్ని ఈద్ ఉల్ జుహా సూచిస్తూ.. అందరి శ్రేయస్సు కోసం పనిచేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా పేదలతో ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు కోవింద్. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు.
ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు - బక్రీద్ శుభాకాంక్షలు
బక్రీద్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. సమగ్రమైన సమాజాన్ని సృష్టించేందుకు ఈ పర్వదినం స్ఫూర్తినిస్తుందని అన్నారు ప్రధాని మోదీ.
ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సమగ్రమైన, శ్రావ్యమైన, న్యాయమైన సమాజాన్ని సృష్టించడానికి ఈ పర్వదినం స్ఫూర్తినిస్తుందని అన్నారు. సోదరభావం, దయాగుణ స్ఫూర్తి మరింత వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.