తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నా' - రామ్‌నాథ్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో రాష్ట్ర ప్రజలు అపరిమితంగా లబ్ధి పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి.

By

Published : Aug 14, 2019, 8:29 PM IST

Updated : Sep 27, 2019, 12:52 AM IST

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రజలు అపరిమిత లబ్ధి పొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రజల్లానే.. కశ్మీర్​వాసులు సమాన హక్కులు పొందుతారన్నారు కోవింద్.

జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

"జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌పై తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు అధిక ప్రయోజనాలు పొందుతారన్న విశ్వాసం నాకుంది. అన్ని హక్కులు, ప్రజాస్వామ్య లాభాలను జమ్ముకశ్మీర్‌ వాసులు పొందుతారు. సమానత్వం పెంచే ప్రగతిశీల చట్టాలను ప్రజలందరూ వినియోగించుకోవచ్చు. పిల్లలందరికీ విద్య పొందే అవకాశం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే అధికారం రావడం వల్ల జమ్ముకశ్మీర్‌లో ప్రజా హిత కార్యక్రమాలను చేపట్టవచ్చు. తరతరాలుగా వంచనకు గురవుతున్న వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తాయి."

-రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి.

ముమ్మారు తలాక్‌ నిషేధంతో ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు కోవింద్.

Last Updated : Sep 27, 2019, 12:52 AM IST

ABOUT THE AUTHOR

...view details