తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సావంత్​ రాజీనామా ఆమోదం- జావడేకర్​కు పగ్గాలు - కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా ఆమోదం

కేంద్ర మంత్రి పదవికి శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిథి తెలిపారు.

అరవింద్ సావంత్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

By

Published : Nov 12, 2019, 10:42 AM IST

Updated : Nov 12, 2019, 2:36 PM IST

సావంత్​ రాజీనామా ఆమోదం

శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రాజీనామా ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిథి తెలిపారు. తక్షణమే సావంత్​ రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు.

కేంద్రమంత్రిగా అరవింద్ సావంత్ చేపట్టిన భారీ పరిశ్రమల శాఖను మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​కు కేటాయించినట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి పీఠం కోసం మహారాష్ట్రలో భాజపాతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు శివసేన సిద్ధపడుతోంది. ఉద్ధవ్​ ఠాక్రేకు మద్దతివ్వాలంటే ఎన్​డీఏ కూటమి నుంచి పూర్తిగా వైదొలగాలని ఎన్​సీపీ డిమాండ్ చేసిందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్రమంత్రి, శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ సోమవారం ప్రకటించారు. తొలుత 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి.. ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:- 'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్​సీపీకి ఆహ్వానం!

Last Updated : Nov 12, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details