తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాంటీబాడీలు ఉన్నా కరోనా నుంచి రక్షణ కష్టమే! - coronavirus antibodies

కరోనా నుంచి యాంటీబాడీలు రక్షణ కల్పిస్తాయని అందరూ భావిస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. వాటి ద్వారా ఓ వ్యక్తి వైరస్​ బారిన పడినట్లు మాత్రమే గుర్తించవచ్చని, దీర్ఘకాలం శరీరంలో ఉండవని తెలిపారు.

Presence of antibodies may not guarantee protection from COVID-19, say scientists
యాంటీబాడీలు కూడా కరోనా నుంచి రక్షణ కల్పించలేవు!

By

Published : Sep 7, 2020, 6:51 PM IST

Updated : Sep 7, 2020, 7:11 PM IST

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సమయంలో నేషనల్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇమ్యునాలజీ(ఎన్​ఐఐ) శాస్త్రవేత్తలు ఆందోళనకర విషయాలు వెల్లడించారు. శరీరంలో యాంటీబాడీలను గుర్తించడం ద్వారా ఓ వ్యక్తి వైరస్ బారినపడినట్లు నిర్ధరించడమే తప్ప.. కరోనాను అధిగమించినట్లు కాదని తెలిపారు. యాంటీబాడీలు దీర్ఘకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీబాడీలు రెండు రకాలు.

1. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్

2. సింపుల్​ యాంటీబాడీస్​

"కరోనా సోకిన వారిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్​ ఉత్పత్తి అయితే.. అవి శరీరంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకుని పూర్తిగా నాశనం చేస్తాయి. ఒకవేళ సింపుల్ యాంటీబాడీస్​ ఉత్పత్తి అయితే మాత్రం అవి వైరస్​ను శరీరమంతా వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేవు." అని ఇండియన్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ సైన్స్​ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్​(ఐఐఎస్​ఈఆర్​) పరిశోధకులు వినీత బాల్​ చెప్పారు.

న్యూట్రలైజింగ్​ యాంటీబాడీలు తగిన సాంద్రతలో ఉంటే కరోనా నుంచి దీర్ఘకాలం రక్షణ కల్పిస్తాయని వినీత పేర్కొన్నారు. అవి ఏ స్థాయిలో ఉంటే రక్షణ లభిస్తుందనే విషయంపై మాత్రం స్పష్టతలేదని వివరించారు. ప్లాస్మా థెరపీ కూడా ఎంతవరకు ఉపయోగకరమో చెప్పలేమన్నారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయిన వారు మరోసారి వైరస్​ బారిన పడే అవకాశాలు తక్కువని.. అయితే అది ఎంతకాలమో తెలియదని చెప్పారు వినీత.

సీరో సర్వేలు...

ఎంతమంది కరోనా బారినపడ్డారో తెలుసుకునేందుకు కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా సీరో సర్వేలు నిర్వహిస్తున్నారు. మెట్రో ప్రాంతాల్లో అధికారికంగా నమోదైన కేసుల కంటే అత్యధిక మందికి వైరస్ సోకినట్లు వారిలోని యాంటీబాడీలను గుర్తించడం ద్వారా వెల్లడైంది. అయితే కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివా లేక నెగిటివా అని చెబుతున్నారు తప్ప వ్యక్తుల్లో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించేలా పరీక్షలు జరగడం లేదని ఎన్​ఐఐ శాస్త్రవేత్త సత్యజిత్ రథ్​​ అన్నారు.

యాంటీబాడీలు శరీరంలో నాలుగునెలల పాటు ఉంటాయని సెప్టెంబరు 1న ఎన్ఈజేఎం జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు ఏంటి?'

Last Updated : Sep 7, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details