తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం' - యూనివర్సీటీ పరీక్షలు

366 విశ్వవిద్యాలయాలు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమని యూజీసీకి వివరించాయి. ఇప్పటికే 194 వర్సిటీలు ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో పరీక్షలు నిర్వహించాయని అవి స్పష్టం చేశాయి.

Prepare to conduct exams soon: Universities: UGC
త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం: యూనివర్సీటీలు

By

Published : Jul 18, 2020, 12:12 PM IST

విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలపై దేశంలోని 755 యూనివర్సిటీలు స్పందించాయి. వీటిలో 120 డీమ్డ్‌, 274 ప్రైవేటు, 40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాయి. పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు కూడా త్వరలో నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. 2019-20 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన 27 కొత్త యూనివర్సిటీలు తొలి బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వివరాలు వెల్లడించింది.

విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఈనెల 6న విధి విధానాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు

ABOUT THE AUTHOR

...view details