గత ఏడాది ఆగస్టు 5న అధికరణ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించగా, రెండు జిల్లాల్లో 2జీ సేవలను తిరిగి ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతం అంతటా వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే వినియోగదారుల పత్రాలను పరిశీలించిన తర్వాతే అంతర్జాల సేవలను అందించాలని టెలికాం కంపెనీలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాల సేవలు అందించేందుకు పరిమితి విధించుకోవాలని సూచించింది.