కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి దిగజార్చుతోంది. కర్ణాటక మంగళూరుకు చెందిన వలస కార్మికులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వగ్రమానికి చేరేందుకు నిండు గర్భిణిని వెంటబెట్టుకుని దాదాపు 142కి.మీ కాలినడకన ప్రయాణించారు.
బిజాపుర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది కార్మికులు కేరళ కన్నూరులో భవన నిర్మాణ పని దొరికిందని ఆనందంగా వెళ్లారు. కానీ, అంతలోనే ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పనిలోకి రమ్మన్న కాంట్రాక్టరే.. ఇక్కడ పని లేదు వెళ్లిపొమ్మన్నాడు. గత్యంతరం లేక, ఊరెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, రవాణా సౌకర్యం లేదు, తప్పని పరిస్థితుల్లో నడక మొదలెట్టారు. వారిలో ఓ నిండు చూలాలు కూడా ఉంది.