తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాయం అందించబోతే.. తల తెగిపోయింది! - pregnant dead latest news

ఓ రంపపు మిల్లులో పని చేసే ఓ గర్భిణీ.. తోటి కార్మికులకు తేనీరు అందిస్తూ, నవ్వుతూ ముచ్చట్లు పెట్టింది. పక్కనే ఖాళీగా ఉన్న రంపపు యంత్రం కనిపించింది. వారికి సాయం చేయాలనుకొని పని మొదలు పెట్టగా.. అనుకోకుండా మహిళ దుపట్టా యంత్రంలో చిక్కుకుంది. అంతే క్షణంలో ఆమె తల.. మొండెం నుంచి తెగిపడి మరణించింది.

Pregnant woman stuck in sawmill dies ghastly
సాయం అందిచబోతే.. తల తెగిపోయింది

By

Published : May 30, 2020, 1:57 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో ఘోర ప్రమాదం జరిగింది. రంపపు మిల్లులోని యంత్రంలో ఓ గర్భిణీ ప్రమాదవశాత్తు చిక్కుకొని తల తెగిపడి మరణించింది.

క్షణంలోనే అంతా జరిగిపోయింది..

పోలీసుల కథనం ప్రకారం.. కల్పన(23), ఆమె భర్త ధర్మరాజ్​ సూలూరులోని ఓ రంపపు మిల్లులో పని చేస్తున్నారు. భర్త బ్యాంకు పని మీద మిల్లు నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో పరిశ్రమలోని కార్మికులకు తేనీరు తీసుకొచ్చింది కల్పన. పక్కనే ఉన్న రంపపు యంత్రం ఖాళీగా ఉండటం చూసి.. అక్కడి వారికి సాయం అందించాలనుకుంది.

కల్పన

పని చేస్తుండగా చేతిలో ఉన్న దుంగ జారిపోయింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కల్పన.. దుపట్టా యంత్రంలో చిక్కుకుంది. ఆ విషయం తెలుసుకునే లోపే.. క్షణంలో అంతా జరిగిపోయింది. ఆమె తల.. మొండెం నుంచి విడిపోయింది. చనిపోయే సమయానికి మహిళ 7 నెలల గర్భవతి. మరో 3 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది.

ABOUT THE AUTHOR

...view details