కరోనాతో పోరాడుతున్న గర్భిణికి సిజేరియన్ ద్వారా విజయవంతంగా ప్రసవం చేసి కేరళ వైద్యులు చరిత్ర సృష్టించారు.
కాసర్‌గోడ్‌కు చెందిన ఓ మహిళ కరోనాతో పోరాడుతూ కన్నూర్‌లోని ప్రియరామ్ మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె ప్రసవ సమయం దగ్గర పడటం కారణంగా వైద్యులు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)లు ధరించి.. సిజేరియన్ ద్వారా పసికందును బయటకు తీశారు. నవజాత శిశువు శాంపిళ్లను కొవిడ్ నిర్ధరణ పరీక్షకు పంపించారు.