తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు కాస్త ఊరట- తగ్గిన లోటు వర్షపాతం

దేశవ్యాప్తంగా రుతుపవనాల రాకకు ముందు లోటు వర్షపాతం తగ్గిందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. ఏప్రిల్​ నాటికి 27 శాతంగా ఉన్న లోటు వర్షపాతం మే నెలకు 22 శాతానికి తగ్గిందని తెలిపింది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

రుతుపవనాలకు ముందు తగ్గిన లోటు వర్షపాతం

By

Published : May 19, 2019, 6:21 PM IST

రుతుపవనాల రాకకు ముందు దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం తగ్గిందని 'భారత వాతావరణ సంస్థ(ఐఎండీ)' తెలిపింది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో ఏప్రిల్​ నాటికి 27 శాతంగా ఉన్న లోటు వర్షపాతం మే నెలకు 22 శాతానికి తగ్గిందని తెలిపింది. సాధారణంగా ఈ కాలంలో 96.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏడాది కేవలం 75.9 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని స్పష్టం చేసింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి ఈ లోటు వర్షపాతం తక్కువగా ఉండడం ఎంతో అవసరం.

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా 46 శాతం, ఆ తర్వాత ఉత్తర భారత రాష్ట్రాల్లో 36 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్​, బిహార్​, పశ్చిమ బంగాల్​, ఒడిశాల్లో 7 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

మధ్య భారత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, చత్తీస్​గఢ్​, గుజరాత్​, మధ్యప్రదేశ్​లో ఎలాంటి లోటు వర్షపాతం నమోదవ్వలేదని ఐఎండీ మాజీ డైరెక్టర్​ జనరల్​ లక్ష్మణ్​ సింగ్​ రాఠోడ్​​ తెలిపారు.

ఇదీ చూడండి : సర్వత్రా ఉత్కంఠ​.. కాసేపట్లో ఎగ్జిట్​ పోల్స్​!

ABOUT THE AUTHOR

...view details