తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో ప్రత్యేక ప్రార్థనలు- భూమిపూజ మాత్రం... - ram temple construction

అయోధ్యలో రామ మందిర నిర్మాణం బుధవారం లాంఛనంగా ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించినా... అలా జరగలేదు. శివుడికి రుద్రాభిషేకం చేసి కార్యక్రమాన్ని ముగించారు పూజారులు. భూమిపూజ ఎప్పుడు ఉండొచ్చన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

Prayers held at Ram Janmabhoomi site for 'early start' to temple construction
అయోధ్యలో రామాలయ నిర్మాణం నిలిపివేత

By

Published : Jun 10, 2020, 6:48 PM IST

అయోధ్య రామ జన్మభూమిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమం ద్వారా రామ మందిర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తొలుత ప్రకటించినా... అలా చేయలేదు.

కుబేర తిలా క్షేత్రం వద్ద నిర్వహించిన రుద్రాభిషేకంలో పాల్గొన్న మహంత్ కమల్ నయన్​ దాస్... ఆలయ నిర్మాణం త్వరగా ప్రారంభం కావాలని భగవంతుడ్ని ప్రార్థించినట్లు చెప్పారు.

రామ మందిర ట్రస్టు సారథి మహంత్ నృత్య గోపాల్​ దాస్​కు కమల్​ నయన్​ దాస్ అధికార ప్రతినిధి.

ప్రకటనకు భిన్నంగా...

రుద్రాభిషేకం పూర్తయ్యాక రామాలయానికి భూమిపూజ జరుగుతుందని సోమవారం ప్రకటించారు కమల్ నయన్​ దాస్. కానీ... బుధవారం ముహూర్త సమయానికి రామ మందిర ట్రస్టు సభ్యులు ఎవరూ రాలేదు. మణి రామ్​ చౌనీ ఆలయ అర్చుకులు మాత్రమే రాగా... వారితో కలిసి పూజలు నిర్వహించారు కమల్ నయన్ దాస్.

ABOUT THE AUTHOR

...view details