నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా దిల్లీలోని కల్కాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలోని ముంబాదేవి ఆలయంలో పూజలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దుర్గామాత దర్శనం దిల్లీ జన్దేవాలన్ ఆలయంలో అమ్మవారు ప్రధాని శుభాకాంక్షలు :
నవరాత్రి ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ఆశీర్వాదంతో దేశ ప్రజలందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పేద, అణగారిన ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి అమ్మ ఆశీర్వాదం తమకు బలాన్నిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
యూపీ సీఎం ప్రత్యేక పూజలు :
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవరాత్రి పర్వదినం సందర్భంగా బలరాంపుర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.