లాక్డౌన్ వేళ దాదాపు అందరూ ఇళ్లకే పరిమితయ్యారు. కానీ, వలస కూలీలు పని లేక.. పట్టణాల్లో బతకలేక ఇక్కట్లు పడుతున్నారు. సొంతూరు పోదామంటే రవాణా సౌకర్యం లేదు. ఇలాంటి కఠోర పరిస్థితుల్లో బెంగళూరు నుంచి 1800 కి.మీ ఆపసోపాలు పడుతూ ప్రయాణించి రాజస్థాన్లోని స్వగ్రామానికి చేరుకున్నాడు ఓ వలస కార్మికుడు.
దారంతా కష్టాలే..
జాలోర్ జిల్లా చీతల్వాన్లోని గిరిధర్ ఘోరేకు చెందిన ప్రవీణ్.. పొట్టకూటికోసం బెంగళూరు వెళ్లాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్తో జీవనోపాధి కోల్పోయాడు. చేసేదేమీ లేక మార్చి 26న బెంగళూరు శివాజీనగర్ నుంచి కాలినడకన ఇంటికి బయల్దేరాడు. 70కి.మీ నడిచి తుమకూర్ చేరకున్నాడు. ఆ తర్వాత గ్యాస్బండిలో లిఫ్ట్ అడిగి, ఓ ట్రక్కులో క్లీనర్ పనులు చేసి , పాల ట్యాంకర్ డ్రైవర్లను బతిమాలి కొంత దూరం ప్రయాణించాడు.
లాఠీ దెబ్బలు
మార్గమధ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరిగినందుకు మహారాష్ట్ర సరిహద్దు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నాడు ప్రవీణ్. ధానేరా పోలీసులు మానవత్వంతో జీపులో కొంత దూరం వరకు వెళ్లాడు. కానీ, జీపు బోల్తాపడి గాయాలపాలయ్యాడు. అక్కడి నుంచి మళ్లీ నడక ప్రారంభించాడు.