తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విధి అడ్డుపడ్డా వివాహం ఆగలేదు- స్ట్రెచ్చర్​పైనే! - Kunda

పెళ్లి కావాల్సిన వధువు.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. వివాహ వేడుకలకు వచ్చిన వారంతా.. అంతా అయిపోయింది అనుకున్నారు. అయితే స్ట్రెచ్చర్​ సాక్షిగా ఆమెను పెళ్లి చేసుకుని తన ఉదారతను చాటుకున్నాడు వరుడు. కష్ట కాలంలో ఆమెకు తోడుగా నిలిచాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Pratapgarh man marries severely injured woman on stretcher
స్ట్రెచ్చర్​ సాక్షిగా వివాహ వేడుకలు!

By

Published : Dec 18, 2020, 12:11 PM IST

మెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై స్ట్రెచ్చర్​పై ఉన్న వధువును వివాహం చేసుకుని తన ఉదారతను చాటుకున్నాడు ఓ వరుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో జరిగింది.

క్షణాల్లో తారుమారు..

కొన్ని గంటల్లో అద్వేశ్​, ఆర్తీకి అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సి ఉంది. వివాహ వేడుకను చూడటానికి వచ్చినవారితో పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. కానీ కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది.

తాళి కట్టించుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబై సంతోషంగా వస్తున్న వధువు.. మెట్లపై నుంచి పడబోతున్న చిన్నారిని రక్షించే ప్రయత్నంలో జారిపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆర్తీని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. ఆమె వెన్నుముకకు తీవ్ర గాయమైంది. కొంత కాలం లేదా పూర్తిగా ఆమె మంచానికే పరిమితం కావచ్చని వైద్యులు తెలిపారు.

దీంతో పెళ్లి ఆగిపోతుందని కంగారు పడిన వధువు తల్లిదండ్రులు.. తన చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోమని వరుడ్ని కోరారు. అయితే అందుకు అంగీరించని అద్వేశ్​.. ఆర్తీనే చేసుకుంటానని, ఈ సమయంలో ఆమెను చూసుకోవడానికి ఓ తోడు కావాలని చెప్పగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

స్ట్రెచ్చర్​ సాక్షిగా వివాహ వేడుకలు!

ఆసుపత్రికి తీసుకొచ్చిన స్ట్రెచ్చర్​పైనే తిరిగి మండపానికి తీసుకెళ్లి.. ముహూర్త సమయానికే ఆర్తీని వివాహం చేసుకున్నాడు అద్వేశ్​. తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:కశ్మీర్​ లోయలో బోటు అంబులెన్స్​ సేవలు!

ABOUT THE AUTHOR

...view details