వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో..
షేక్పుర్ గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రతాప్‌గఢ్ సమీపంలో ప్రమాదం జరిగింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కొల్పోయి అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు.