సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై సుప్రీం విచారణ చేపట్టింది. ఎం.నాగేశ్వర్ రావు నియామకంపై ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం తప్పుడు వివరాలు కోర్టుకు సమర్పించిందని తప్పుగా ట్వీట్ చేశానని న్యాయవాది భూషణ్ అంగీకరించారు.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. న్యాయవాది భూషణ్ వ్యాఖ్యలతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. న్యాయవాదికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుకోవట్లేదని తెలిపారు.