మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడుతోందని... చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.
"నేను ఆయన్ని కలిశాను. ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షించడం వల్ల.. రికవరీ అవుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్య సూచీలన్నీ బాగున్నాయి. తొందరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాను."