మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం ప్రణబ్ ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన బ్రెయిన్‌కు శస్త్రచికిత్స చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ప్రణబ్ ముఖర్జీకి శస్త్ర చికిత్స విజయవంతం - Pranab Mukherjee corona news
కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఆయనకు బ్రెయిన్ సర్జరీని పూర్తి చేసినట్లు దిల్లీలోని ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రణబ్ ముఖర్జీకి శస్త్ర చికిత్స విజయవంతం
84 ఏళ్ల వయస్సు ఉన్న ప్రణబ్ ముఖర్జీ తనకు కొవిడ్ సోకిన విషయాన్ని సోమవారం స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ వారం రోజుల్లో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు.
Last Updated : Aug 11, 2020, 7:39 AM IST