మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు వైద్యులు. మంగళవారం నుంచి మూత్రపిండాల పారామితుల్లో కొంత అసమానతలు నెలకొన్నట్లు గుర్తించామని తెలిపారు.