మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా ముందు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
" ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత వారం రోజుల్లో నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్బంధలోకి వెళ్లి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా."
- ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి.