కాంగ్రెస్‌ను గందరగోళ పార్టీగా అభివర్ణించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. సీడీఎస్‌గా బిపిన్ రావత్‌ను నియమించడంపై ఆ పార్టీ ప్రశ్నలు లేవనెత్తడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై రాజకీయాలు చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచేప్పారు.
సీడీఎస్ దేశంలో సరికొత్త వ్యవస్థకు నాంది పలికిందని.. దేశానికి గర్వకారణమన్నారు జావడేకర్. సీడీఎస్ నియామంకపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ ట్వీట్లను ఆయన సలహాదారులు పోస్ట్ చేస్తారని, కాంగ్రెస్ నేతలు భిన్నంగా మాట్లాడతారని అందుకే ఆ పార్టీ గందరగోళ పార్టీ అని దుయ్యబట్టారు.