తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాతయ్య కోసం మనుమడి రాజీనామా! - సీటు

దేవేగౌడకు ఆయన మనుమడు ప్రజ్వల్​ రేవణ్న మద్దతుగా నిలిచారు. తాను గెలుపొందిన హసన్​ స్థానానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో మాజీ ప్రధాని దేవేగౌడ పోటీ చేసి గెలిస్తే.. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు.

24 గంటల్లోనే:దేవేగౌడ కోసం మనుమడి రాజీనామా

By

Published : May 24, 2019, 1:08 PM IST

Updated : May 24, 2019, 1:26 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్​ దళపతి దేవేగౌడ్​ అనూహ్య రీతిలో ఓడిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దేవేగౌడకు ఆయన మనుమడు, జేడీఎస్​ నేత ప్రజ్వల్ రేవణ్న మద్దతుగా నిలిచారు. పార్టీకి నూతన ఉత్తేజాన్ని అందించడానికి తాను గెలిచిన హసన్​ స్థానానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో దేవేగౌడ పోటీ చేసి గెలవాలని ఆకాంక్షించారు.

దేవేగౌడ కోసం మనుమడి రాజీనామా

"పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపడానికి నేను ఓ నిర్ణయానికి వచ్చాను. నేను గెలిచిన హసన్​ స్థానానికి రాజీనామా చేస్తా. దేవేగౌడ అక్కడ పోటీ చేసి విజయం సాధించాలి. దీనికి కాంగ్రెస్​ - జేడీఏస్​ అగ్రనేతలు మద్దతివ్వాలి."
--- ప్రజ్వల్​ రేవణ్న, జేడీఎస్​ నేత

సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్​ ఘోరంగా ఓడిపోయింది. కేవలం హసన్​ సీటును మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్​ ఒక సీటులో విజయం సాధించింది. భాజపా 25 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. సుమలత మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

ఇదీ చూడండి: అడ్వాణీకి ప్రధాని మోదీ పాదాభివందనం

Last Updated : May 24, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details