మధ్యప్రదేశ్ భోపాల్ లోక్సభ స్ధానం భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలపై పార్టీ స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక బృందం మాజీ సారథి హేమంత్ కర్కరేపై సాధ్వి వ్యాఖ్యలకూ.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది.
సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకుర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలిపింది కాషాయ పార్టీ. చాలా ఏళ్లపాటు శారీరక, మానసిక వ్యధను అనుభవించినందు వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది భాజపా.
"ఉగ్రవాదులపై ధైర్యసాహసాలతో పోరాడుతూ కర్కరే మరణించారు. ఆయనను భాజపా.. ఎప్పటికీ అమరుడిగానే గౌరవిస్తుంది."
-లేఖలో భాజపా