తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాధ్వి ప్రమాణ స్వీకారం సందర్భంగా తీవ్ర గందరగోళం - OATH

లోక్​సభలో భాజపా ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​ ప్రమాణం చేస్తుండగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు. సాధ్వి పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ప్రొటెం స్పీకర్ చొరవతో ప్రమాణం పూర్తి చేశారు భోపాల్​ ఎంపీ.

సాధ్వి ప్రమాణ స్వీకారం సందర్భంగా తీవ్ర గందరగోళం

By

Published : Jun 18, 2019, 12:01 AM IST

సాధ్వి ప్రమాణ స్వీకారం

లోక్​సభలో మొదటి రోజే వివాదంలో చిక్కుకున్నారు భాజపా ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్. భోపాల్​ నుంచి పార్లమెంట్​కు ఎన్నికైన సాధ్వి.. సోమవారం ప్రమాణం చేస్తుండగా వివాదానికి తావిచ్చారు. ఆమె పూర్తి పేరులో తన ఆధ్యాత్మిక గురువు పేరును జత చేస్తూ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవడమే ఇందుకు కారణం. 'స్వామి పూర్ణచేతనానంద్​ అవ్​ధేషా నంద్​గిరి సాధ్వి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్' అని ప్రమాణం ప్రారంభించగానే కాంగ్రెస్​ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే తన పూర్తి పేరు అదేనని సాధ్వి ప్రొటం స్పీకర్​కు వివరించారు. సభలోని ప్రమాణ పత్రం​లో కూడా అదే రాసినట్లు సభాసభ్యులకు తెలిపేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్​ నేతలు వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు సంస్కృతంలో ఎంపీగా ప్రమాణం చేసిన సాధ్వి చివర్లో 'భారత్​ మాతా కీ జై' అంటూ తన ప్రమాణాన్ని ముగించారు.

ABOUT THE AUTHOR

...view details