కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ తనను ఉగ్రవాదిగా అభివర్ణించినందున ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. ఏ న్యాయస్థానం కూడా తనను దోషిగా నిర్ధరించకుండా ఉగ్రవాదిగా పిలవడం.. పార్లమెంటు సభ్యురాలిగా తన హక్కులను భంగపర్చడమేనని పేర్కొన్నారు.
రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ప్రగ్యా లేఖ - rahul gandhi news
రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు ప్రగ్యా సింగ్ ఠాకూర్. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు లేఖ
ఈ లేఖను లోక్‌సభ సచివాలయం పరిశీలించి సరైనదే అని తేలితే స్పీకర్‌కు నివేదించనుంది. అనంతరం ఆయన ఈ లేఖను సభా హక్కుల కమిటీకి పంపిస్తారు.
ఇదీ చూడండి: గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్.. పట్టేసిన పోలీసులు!