తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాధ్వి ప్రజ్ఞ సింగ్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

మాలేగావ్​ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్​ లోక్​సభ స్థానం భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్​ వివాదంలో చిక్కుకున్నారు. 26/11 ముంబయిపై ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన హేమంత్​ కర్కరేపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు.

సాధ్వి వ్యాఖ్యలపై దుమారం

By

Published : Apr 19, 2019, 6:03 PM IST

Updated : Apr 19, 2019, 10:34 PM IST

సాధ్వి వ్యాఖ్యలపై దుమారం

ఉగ్రవాద వ్యతిరేక బృందం మాజీ సారథి హేమంత్​ కర్కరేపై సంచలన ఆరోపణలు చేశారు సాధ్వి ప్రజ్ఞ సింగ్​. మాలేగావ్​ కేసు దర్యాప్తు విషయంలో హేమంత్​ తనను వేధించారని ఆరోపించారు. ఎలాంటి రుజువు లేకున్నా బలవంతంగా జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారంటూ మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

26/11 ముంబయి ఉగ్రదాడి సమయంలో ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి సారథిగా ఉన్నారు కర్కరే. ఆ సమయంలోనే తీవ్రవాదులతో పోరాడి.. మరో ఇద్దరు పోలీసు అధికారులతో కలిసి అమరుడయ్యారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు.

ఈసీకి ఫిర్యాదు...

మధ్యప్రదేశ్​ ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రజ్ఞకు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైంది. విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

విమర్శలు...

ప్రజ్ఞ సింగ్​ ఆరోపణలను తప్పుబట్టారు భోపాల్​ కాంగ్రెస్​ అభ్యర్థి దిగ్విజయ్​ సింగ్​.

''హేమంత్​ కర్కరే నిబద్ధత కలిగిన అధికారి. దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వీరుడిని గౌరవించాలి. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈసీ చర్యలు తీసుకోవాలి.''

- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ నేత

ఐపీఎస్​ అధికారుల సంఘం భాజపా అభ్యర్థి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

హేమంత్​ కర్కరేపై ప్రజ్ఞ సింగ్ వ్యాఖ్యలపై స్పందించారు భాజపా నేత నళిన్​ కోహ్లీ. అది ఆమె వ్యక్తిగతానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

''హేమంత్​ కర్కరే త్యాగానికి నేను నమస్కరిస్తున్నా. భారతదేశానికి ఆయనొక వీరుడు. భారత దేశాన్ని రక్షించడానికి ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరినీ మేం గౌరవిస్తాం. హేమంత్​ కర్కరే సేవల్ని మేం గుర్తించాం. ప్రజ్ఞ వ్యాఖ్యలు భాజపాకు ఆపాదించొద్దు. అవి ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించినవి. ఆమె విచారణ ఎదుర్కొన్నారు కాబట్టి స్పష్టంగా తెలుస్తోంది వ్యక్తిగతమని. కాబట్టి ఇది భాజపాకు సంబంధించినది కాదు. దీనిని రాజకీయం చేయాలనుకోవట్లేదు.''

- నళిన్​ కోహ్లీ, భాజపా నేత

భాజపా అభ్యర్థి...

సాధ్వి ప్రజ్ఞ సింగ్​ ఠాకుర్​ను ఏప్రిల్​ 17న భారతీయ జనతా పార్టీ.. మధ్యప్రదేశ్​ భోపాల్​ లోక్​సభ స్థానం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడే ప్రముఖ కాంగ్రెస్​ నేత, మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్​ సింగ్​ బరిలో ఉన్నారు.

ప్రజ్ఞ ప్రస్తుతం బెయిల్​పై ఉన్నారు. మాలేగావ్​ పేలుళ్లకు సంబంధించిన ఓ కేసులో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మరో కేసులో ఆమె ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి:ములాయం, మాయ ఐక్యరాగం- మోదీపై ధ్వజం

Last Updated : Apr 19, 2019, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details