వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.తాజాగా 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ముంబయి ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరయ్యారు సాధ్వీ. అనంతరం కోర్టులో సరైన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజ్ఞా... ఏకంగా రెండు గంటల పాటు నిల్చునే ఉన్నారు.
ఇదీ జరిగింది
విచారణలో భాగంగా సాధ్వీ కూర్చునేందుకు బోనులో కుర్చీని ఏర్పాటు చేశారు. ఆ కుర్చీపై అసంతృప్తి వ్యక్తం చేసిన భోపాల్ ఎంపీ... కిటికీకి ఆనుకుని నిలబడ్డారు. విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికి బోను పక్కన కుర్చీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సాధ్వీ అలాగే రెండున్నర గంటల పాటు నిల్చునే ఉన్నారు.