తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదు' - modi

మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​పై తీవ్ర ఆరోపణలు చేశారు భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్​. '1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడు' తనను విమర్శించటం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు.

కమల్​నాథ్​పై సాధ్వీ ఆగ్రహం

By

Published : Apr 21, 2019, 5:48 AM IST

Updated : Apr 21, 2019, 8:08 AM IST

కమల్​నాథ్​పై సాధ్వీ ఆగ్రహం

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు తనను విమర్శించే నైతిక హక్కు లేదని భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు. ముంబయి మాజీ పోలీస్​ అధికారి హేమంత్​ కర్కరేపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను కమల్​నాథ్​ తీవ్రంగా వ్యతిరేకించారు.

"ప్రజ్ఞా ఠాకూర్​ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. ఆరంభంలోనే ఆమె ఇలా మాట్లాడారు. ఇది ఎక్కడ అంతమవుతుందో చూడాలి."
-కమల్​నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

కమల్​ విమర్శలపై సాధ్వి ప్రజ్ఞా​ తీవ్రంగా స్పందించారు.

"1984 దాడులు... దాడులు కాదు అదో హత్యాకాండ.. ఈ మారణ కాండలో దోషిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏ నైతికత ఉందని సాధ్వీ అంతం గురించి మాట్లాడుతున్నారు. మీరు అవినీతితోనే జీవించండి. ఆ దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. సాధ్వికీ అంతం ఉంటుందని మాట్లాడటం ఏమిటి? హిందుత్వాన్ని తీవ్రవాదమని చెప్పేవారే దేశానికి శత్రువులు."
-ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి

2008లో జరిగినమాలెగావ్​ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా నిందితురాలు. తనను కర్కరే తీవ్రంగా హింసించారని, తన శాపం వల్లనే ఆయన మరణించారన్న ప్రజ్ఞా వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది.

ప్రజ్ఞాకు భోపాల్​ లోక్​సభ టికెట్​ ఇవ్వటాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమర్థించారు.

" సాధ్విప్రజ్ఞాను భోపాల్​ బరిలోకి దింపడమనేది... హిందు మతం, సంస్కృతిని తీవ్రవాదంగా పరిగణించేవారికి గట్టి సమాధానంగా మిగులుతుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Apr 21, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details